ఆలూరు నియోజకవర్గ వైయస్సార్సీపి యువ నేత, చిప్పగిరి జెడ్పిటిసి సభ్యులు విరుపాక్షి 53వ పుట్టినరోజు వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా యూత్ నాయకులు మసాలా ప్రకాష్, బిణిగేరి సర్పంచ్ వెంకటేష్ లు అంబేద్కర్ సర్కిల్లో పుట్టినరోజు కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా చిప్పగిరి జెడ్పిటిసి సభ్యులు విరుపాక్షి నియోజవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చిన నేనున్నానంటూ పేదల కష్టాలు తీరుస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ప్రజాసేవ తన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారన్నారు. దేవుడు అన్ని విధాలుగా ఎల్లవేళలా అండగా నిలవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యువకులు సందీప్ ,వీరేష్, వెంకటేష్, మహీంద్రా, కృష్ణమూర్తి, మధు, పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు.