Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

జగన్ తోనే రాష్ట్రం అభివృద్ధి

విశాలాంధ్ర- పెద్దకడబూరు : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని హులికన్వి, బాపులదొడ్డి గ్రామంలో గ్రామ సర్పంచ్ మహాదేవ, వైసీపీ నేత మూకిరెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి ఆరా తీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల పక్షపాతి అని వారి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించే జగన్ ను మరువవద్దని కోరారు. అనంతరం గ్రామ సచివాలయంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో సమావేశం నిర్వహించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర యువనాయకులు ప్రదీప్ రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, మాజీ ఎంపిపి రఘురామ్, గజేంద్రరెడ్డి, విజయేంద్ర రెడ్డి, జాము మూకన్న, ముక్కరన్న, అర్లప్ప, మూలింటి ఈరన్న, మహాదేవ, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img