విశాలాంధ్ర- పెద్దకడబూరు : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక ఎస్సీ కాలనీలో ప్రధాన రహదారిలో కొత్త అంగన్వాడీ కేంద్రం వద్ద డ్రైనేజీ సమస్య పరిష్కారానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. డ్రెయినేజీ పై వేసిన కల్వర్టును డ్రిల్లింగ్ మిషన్ తో పగలగొట్టారు. డ్రెయినేజీని ఎత్తుగా నిర్మించడానికి వైసీపీ నాయకులు ముక్కరన్న, అర్లప్ప, అనిల్ పర్యవేక్షణలో పనులు చేపట్టారు.