Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

దళితులపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం

విశాలాంధ్ర – ఆస్పరి : కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి దళితులపై దాడులు పెరిగాయని, వాటిని అరికట్టడంలో పాలక ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు గురుదాస్, జిల్లా కార్యదర్శి మహేష్ లు అన్నారు. బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో దళిత హక్కుల పోరాట సమితి మండల కమిటీ సమావేశాన్ని జిల్లా సహాయ కార్యదర్శి ముద్దు రంగన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గురుదాస్, జిల్లా కార్యదర్శి మహేష్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకు దళితులపై దాడులు అధికమవుతున్నాయని ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు జరుగుతున్నప్పటికీ అరికట్టడంలో నరేంద్ర మోడీ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఈ దాడులు అధికంగా జరుగుతున్నాయని, మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ మైనారిటీలపై అగ్రవర్ణాలు దాడులు చేస్తున్న ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడంలేదని ఎన్నికల సందర్భంలో ఓట్ల కోసమే దళితుల జపం చేస్తున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఇతర రంగాలకు దారి మళ్లిస్తూ దళితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఊసే లేదని, ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించి దళితుల అభివృద్ధికి ఉపయోగించేవారని నేడు ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితవాడలలో మౌలిక వసతులు అయిన త్రాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ద్వారా అభివృద్ధి చేయాల్సి ఉండగా నవరత్నాల పేరుతో ప్రభుత్వం వాడుకోవడం చాలా సిగ్గుచేటన్నారు. అనంతరం దళిత హక్కుల పోరాట సమితి మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల గౌరవ అధ్యక్షులుగా కృష్ణమూర్తి, అధ్యక్షులుగా రంగన్న, ఉపాధ్యక్షులుగా హెచ్. రంగన్న, రామన్న, కార్యదర్శిగా రామచంద్ర, సహాయ కార్యదర్శులుగా నల్లన్న, ఆవుని, కోశాధికారిగా పులికొండ తో పాటు సమితి సభ్యులుగా 30 మందిని ఏకీగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి, సీనియర్ నాయకులు బ్రహ్మయ్య, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి రమేష్, లక్ష్మన్న, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img