Friday, December 9, 2022
Friday, December 9, 2022

దేవ సహాయంను హత్య చేసిన ముద్దాయిలను వెంటనే అరెస్టు చేయాలి

న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల ఆందోళన

విశాలాంధ్ర సి.బెళగల్.ఈనెల 24వ తేదీన యనగండ్ల సర్పంచ్ దేవ సహాయం నుహత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి న్యాయం చేయాలని యనగండ్ల సర్పంచు దేవ సహాయం కుటుంబ సభ్యులుధర్నా నిర్వహించారు. బుధవారం మండల కేంద్రమైన సి.బెళగల్ బస్టాండ్లో మృతి చెందిన దేవ సహాయం కుటుంబ సభ్యులు మాకు న్యాయం చేయాలని దాదాపు రెండు గంటల పాటు ఆందోళన చేపట్టారు.వారికి మద్దతుగా జాతీయ మానవ హక్కుల నిరోధక కమిషన్ చైర్మన్ శాంతప్ప, జోజి తదితరులు పాల్గొని వారు మాట్లాడుతూ ఈనెల 24వనాలుగవ తేదీన హత్య జరిగిన ఇప్పటివరకు దేవ సహాయం ను హత్య చేసిన ముద్దాయిలను అరెస్టు చేయలేదని హత్యచేసిన ముద్దాయిలు బయట తిరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని అలాగే కొంతమందిని కేసు నుండి తప్పించాలని చూస్తున్నారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. రెండు గంటల ధర్నా అనంతరం సి.బెళగల్ ఎస్ఐ శివాంజలి అక్కడకు వచ్చి మీరు కేసులోఎవరి పేర్లు కనపరిచారో వారిని ఎవరిని కేసు నుండి తప్పించడం జరగదని కచ్చితంగా అందరినీ అరెస్టు చేస్తామని జాతీయ మానవ హక్కుల నిరోధక కమిషన్ చైర్మన్ శాంతప్ప, జోజి తదితరులు వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అనంతరం వారు ధర్నా విరమించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img