Monday, March 20, 2023
Monday, March 20, 2023

నాడు నేడు పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

విశాలాంధ్ర- పెద్దకడబూరు : నాడు నేడు కింద జరుగుతున్న భవనాలను త్వరితగతిన పూర్తిచేయాలని పంచాయతీ రాజ్ శాఖ ఏఈ మల్లయ్య ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని కంబలదిన్నె, కంబదహాల్, బసలదొడ్డి, పెద్దకడబూరు గ్రామాల్లో జరుగుతున్న రెండో విడత కింద మంజూరైన నాడు నేడు పనులను పంచాయతీ రాజ్ శాఖ ఏఈ మల్లయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు నేడు కింద మండలానికి 28 పాఠశాలలకు అదనపు తరగతి గదులు మంజూరు అయినట్లు తెలిపారు. భవనాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అలాగే రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలను పరిశీలించి నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, రంగన్న, మూర్తి, శ్రావణి, యాస్మిన్, తేజస్విణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img