విశాలాంధ్ర ` పెద్దకడబూరు : గ్రామ పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని ఎంపీడీఓ వెంకట రమణప్ప ఆదేశించారు. మంగళవారం పెద్దకడబూరు మండల పరిషత్ కార్యాలయం నందు డిజిటల్, వెల్ఫేర్, ఇంజనీరింగ్, పశుసంవర్థక శాఖ సహాయకులకు పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2023-24 అనే అంశంపై ఒక రోజు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు అన్నారు. పంచాయతీలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. పంచాయతీల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల సిద్ధంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, పశుసంవర్థక శాఖ సహాయకులు పాల్గొన్నారు.