Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

పింఛన్లపై సామాజిక తనిఖీ చేయడం సిగ్గుచేటు

విశాలాంధ్ర-పెద్దకడబూరు : వృద్దుల పింఛన్లపై సామాజిక తనిఖీ చేయడం సిగ్గుచేటంటూ మంగళవారం సిపిఐ ఆధ్వర్యంలో పెద్దకడబూరులోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, సహాయ కార్యదర్శి చంద్ర, రైతు సంఘం తాలూకా కార్యదర్శి ఆంజనేయ మాట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో వృద్దులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు నెలకొకసారి వచ్చే పించను మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారన్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇప్పటికే చాలా మంది పింఛన్లు అన్యాయంగా తొలగించారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు సామాజిక తనిఖీ చేయడం సరికాదన్నారు. 40 సంవత్సరాల క్రితం చనిపోయిన భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికెట్ ఎక్కడ నుంచి తీసుకో రావాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లాంటి కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం మానుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే పింఛన్లపై సామాజిక తనిఖీ నిలిపి వేయాలని లేని పక్షంలో పింఛన్ల దారులతో కలిసి సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో వెంకట రమణప్పకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు, రామాంజనేయులు, మూసి నాగరాజు, నరసప్ప, అమరేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img