విశాలాంధ్ర` పెద్దకడబూరు : ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఎర్ర జెండా పేదలకు అండగా ఉంటుందని సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం తాలూకా కార్యదర్శి ఆంజనేయ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కల్లుకుంట, మేకడోన, చిన్నకడబూరు గ్రామాలలో సిపిఐ ఆధ్వర్యంలో సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా సిపిఐ సీనియర్ నాయకులు ఇస్మాయిల్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్రానికి పూర్వమే సిపిఐ పార్టీ పురుడు పోసుకొని ఇప్పటికీ కొనసాగుతున్న అతి కొద్ది రాజకీయ పార్టీలలో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రముఖమైనదని గుర్తు చేశారు. సిపిఐ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్ లో పుట్టి 98వ ఏట అడుగు పెట్టిందన్నారు. సిపిఐ పేదలకు అండగా ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కుమ్మరి చంద్ర, నాయకులు ఆంజనేయ, వీరేష్, రామాంజనేయులు, డోలు హనుమంతు, గిడ్డయ్య, ఉప్పర హనుమంతు, డ్రైవర్ భాషా, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.