Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం

విశాలాంధ్ర -పెద్దకడబూరు : ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షులు, క్లస్టర్‌ ఇంచార్జీ జీ. కె.బాబురావు అన్నారు. గురువారం మండల పరిధిలోని రాగిమాన్‌ దొడ్డి, గంగులపాడు గ్రామాల్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు పెంచింది తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ప్రజల కోసం పనిచేసే పార్టీ టిడిపి అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోలింగ్‌ బూత్‌ ఏజెంట్‌ రాముడు, నాయకులు వెంకటరెడ్డి, తిమ్మప్ప, నర్సింహులు, మంచాల హనుమంతు, వెంకటేశ్‌, గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img