విశాలాంధ్ర -శెట్టూరు : శెట్టూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు బుధవారం బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుక నిర్వహించారు పాఠశాల ఉపాధ్యాయులు దివాకర్ రెడ్డి, అశోక్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి ,అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి స్వాతంత్ర్య సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన మన భారత దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు
బాబు జగ్జీవన్ రామ్ అని వారు కొనియాడారు అనంతరం చిత్రపటం పులమాల వేసి ఘన నివాళి అర్పించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, లాలూ స్వామి, కళ్యాణి, జీవన్ బాబు, ఓబులేష్, జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు