Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

భక్తి శ్రధ్ధలతో రంజాన్ వేడుకలు

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని చిన్నతుంబలం, మేకడోన, కంబలదిన్నె, జాలవాడి, కల్లుకుంట, బసలదొడ్డి, పెద్దకడబూరు తదితర గ్రామాల్లో శనివారం రంజాన్ పండుగ వేడుకలు ముస్లిం సోదరులు భక్తి శ్రధ్ధలతో జరుపుకున్నారు. మండల కేంద్రమైన పెద్దకడబూరులో స్థానిక జుమా మసీదు నుంచి గ్రామ శివారులోని ఈద్గా వద్దకు ర్యాలీగా వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఇమామ్ రహిమాన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి అల్లా అడుగు జాడలలో నడవాలని కోరారు. పేదలు, అనాధలు, అభాగ్యుల పట్ల దయ, జాలి, కరుణ, ప్రేమ సోదరభావాన్ని కలిగి జీవించాలని భోదించారు. అనంతరం చిన్నారులు మిఠాయిలు పంచి పెట్టారు. అలాగే టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, బిసి సాధకార రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున, టౌన్ కార్యదర్శి ఆంజనేయ ఇమామ్ రహిమాన్ ను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ శ్రీనివాసులు, అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img