Monday, May 29, 2023
Monday, May 29, 2023

భగత్‌సింగ్‌ స్ఫూర్తి యువతకు ఆదర్శం

విశాలాంధ్ర – ఆస్పరి : భగత్‌ సింగ్‌ జీవితం నేటి యువతరానికి స్ఫూర్తి దాయకమని ఆయన ఆశయాలు కొనసాగించాలని ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి రమేష్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కైరిప్పల గ్రామంలో స్వర్గీయ కామ్రేడ్ బండమీద వెంకటేశ్వర్లు భవనంలో భగత్ సింగ్ 92వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు ల చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్‌ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా, దేశ స్వాతంత్య్రం కోసం అతి చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన వీరులు అన్నారు. జలియన్‌ వాలీబాగ్‌ దురంతంతో ప్రభావితమైన ఆయన జీవితం స్వాతంత్య్రం కోసం పార్లమెంటుపై పొగబాంబులతో దాడి చేసి బ్రిటీష్‌వారిని భయపెట్టాడన్నారు. మతోన్మాదం ఈ దేశానికి చాలా ప్రమాదకరమని నాడే ఆయన చెప్పారని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతం పేరుతో రాజకీయాలు చేయడం చాలా దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు రాజశేఖర్, శేఖర్, ఉరుకుందు, రంగస్వామి, సురేష్, ఏఐఎస్ఎఫ్ మండల సహాయ కార్యదర్శి రెవన్, ధోని, మహేష్, నవీన్, శేఖర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img