Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

మెనూ ప్రకారం భోజనం పెట్టాలి

విశాలాంధ్ర`పెద్దకడబూరు : మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి వెంకట రమణప్ప వంట ఏజెన్సీలను ఆదేశించారు. శనివారం మండల పరిధిలోని నౌలేకల్‌, ముచ్చిగిరి గ్రామాల్లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎంపీడీవో వెంకట రమణప్ప ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ విద్యార్థులతో కూర్చుని భోజనం చేశారు. విధ్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని సూచించారు. భోజనం తయారీలో నాణ్యత పాటించాలన్నారు. అనంతరం గ్రామాల్లో జరుగు జగనన్న గృహాల నిర్మాణాలను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు, మెటీరియల్‌ అందేలా చర్యలు తీసుకోవాలని వర్క ఇన్స్పెక్టర్‌ నాగన్నను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు హనుమంతు, మానప్ప, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img