Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

వాలంటరీల సేవలకు గుర్తింపే పురస్కారాలు

విశాలాంధ్ర- ఆస్పరి : ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడంలో వాలంటరీల పాత్ర కీలకమని, వారి సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలిస్తోదని జిల్లా కేడీసీసీ డైరెక్టర్ మూల్యంతి రాఘవేంద్ర మేజర్ పంచాయతీ సర్పంచ్ మోలింతే రాధమ్మలు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక గ్రామ సచివాలయ కేంద్రంలో మేజర్ గ్రామపంచాయతీ ఇవో రామాంజనేయులు అధ్యక్షతన వాలంటరీలకు శాలువా కప్పి ప్రశంసా పత్రాలను అందజేసి సత్కార సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కేడీసీసీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, సర్పంచ్ మూలింటి రాధమ్మలు పాల్గొని మాట్లాడుతూ15 ఆగష్టు 2019వ తేదీన రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారన్నారు. జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, వరుసగా నాలుగో ఏడాది నిర్వహిస్తున్న వాలంటీర్లకు వందనం సన్మాన కార్యక్రమ నిర్వహణలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారని, వారి సేవలు వెల కట్టలేనివని, వాలంటీర్లు అంటే జగనన్న సైనికులు అని, ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్న వాలంటీర్లు నిజమైన సంక్షేమ సేవకుడే గ్రామ వాలంటీర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటరీలు, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img