:నగదును పంపిణీ చేస్తున్న వైకాపా నేతలు
విశాలాంధ్ర- పెద్దకడబూరు : వైఎస్సార్ భీమా పేదలకు వరం లాంటిదని గొర్రెల ఫెడరేషన్ జిల్లా డైరెక్టర్ కె యల్లప్ప అన్నారు. బుధవారం మండల పరిధిలోని చిన్న తుంబలం గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన లింగప్ప భార్యకు వైఎస్సార్ భీమా పథకం కింద తక్షణ సహాయం కింద 10 వేల రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా మృత దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యాకమిటి చైర్మన్ బొడ్డన్న, ఇస్మాయిల్, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.