Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

షాదీఖానా నిర్మాణం పనులు ప్రారంభం

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల కేంద్రమైన పెద్దకడబూరులో ముస్లింల షాదీఖానా నిర్మాణం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి చొరవతో మంగళవారం వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 22 సంవత్సరాలుగా ముస్లింల షాదీఖానా మొండి గోడలకే పరిమితమైందన్నారు. దీంతో ముస్లింలు పెళ్లిల్లు జరుపుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు . ఈ విషయాన్ని ముస్లింలు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే షాదీఖానా నిర్మాణానికి 35 లక్షల రూపాయలు మంజూరు చేయించారని తెలిపారు. త్వరితగతిన షాదీఖానా నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు . ముందుగా షాదీఖానాకు గ్రావెల్ వేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img