Saturday, February 4, 2023
Saturday, February 4, 2023

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

విశాలాంధ్ర-పెద్దకడబూరు : ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ మండల కన్వీనర్‌ రామ్మోహన్‌ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి చ్కెర్మన్‌ పురుషోత్తం రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని కళ్యాణ మండపం నందు వైసీపీ మండల కన్వీనర్‌ రామ్మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని 18 గ్రామ సచివాలయాల పార్టీ కన్వీనర్లకు, వాలంటీర్లకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలను అందించడమే వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమన్నారు. పథకాలను అందించడంలో వాలంటీర్ల పాత్ర అమోఘమైనదని తెలిపారు. 18 సచివాలయాలకు సంబంధించి 54 పార్టీ కన్వీనర్లను నియమించడం జరిగిందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. నాయకులు నిరుత్సాహం చెందవద్దని, జగన్‌ ను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు తమ వంతు కృషి చెయ్యాలని కోరారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కి గత ఎన్నికల్లో మండలం నుంచి 10 వేల మెజారిటీ వచ్చిందని, రాబోయే 2024 ఎన్నికల్లో మండలం నుంచి 15 వేలకు పైగా మెజారిటీ వచ్చేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చెయ్యాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు రాజేశ్వరి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర రెడ్డి, వైస్‌ ఎంపీపీలు పరమేష్‌, ఇర్ఫాన్‌ దేశాయ్‌, కో ఆప్షన్‌ సభ్యులు షేర్‌ ఖాన్‌, నాయకులు రవిచంద్రా రెడ్డి, శివరామరెడ్డి, గజేంద్ర రెడ్డి, విజయేంద్ర రెడ్డి, వెంకటేశ్వర్‌ రెడ్డి, పూజారి ఈరన్న, జాము మూకన్న, భీమ్‌ శేన్‌ రావ్‌ ఖౌశిక్‌, తిక్కన్న, ముక్కరన్న, అర్లప్ప, సర్పంచులు రామాంజనేయులు, పల్లవి, చంద్రకళ, ఇస్మాయిల్‌, నాగరాజు, హనుమంతు, దస్తగిరి, ఎంపీటీసీ సభ్యులు వెంకటేశులు, మల్లేష్‌, ఆయా గ్రామాల పార్టీ కన్వీనర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img