Monday, December 5, 2022
Monday, December 5, 2022

సర్పంచుల సమస్యలు పరిష్కరించాలి

సర్పంచుల నూతన కమిటీ ఎన్నిక
విశాలాంధ్ర ` ఆస్పరి :
గ్రామపంచాయతీ సర్పంచుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు హరికృష్ణ, కార్యదర్శి సావిత్రమ్మ, ఉపాధ్యక్షులు నెల్లూరప్ప అన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్పంచుల సంఘం సమావేశాన్ని మాజీ సర్పంచ్‌ రామాంజనేయులు అధ్యక్షత నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే మిగిలిపోతున్నారన్నారు. సర్పంచులు అప్పులుచేసి అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారు. ప్రభుత్వం వాడుకున్న పంచాయతీ నిధులను తక్షణమే గ్రామపంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని, అలాగే సర్పంచుల సమస్యలు పరిష్కరించని పక్షంలో జిల్లా కేంద్రాల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామన్నారు. అనంతరం సర్పంచుల మండలం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా హరికృష్ణ, ఉపాధ్యక్షులుగా నెల్లూరప్ప, కార్యదర్శిగా సావిత్రమ్మ, కోశాధికారిగా పెద్దిరెడ్డి లతో పాటు 12 మందిని కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్ష, కార్యవర్గాన్ని శాలువ పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో వైకాపా మండల కన్వీనర్‌ పెద్దయ్య, కో కన్వీనర్‌ పురుషోత్తం రెడ్డి, ఎంపీటీసీ రాధాకృష్ణ, వివిధ గ్రామాల సర్పంచులు వెంకటేష్‌, తోయజాక్షప్ప, మురళీమోహన్‌, యాటకల్లు పెద్దిరెడ్డి, శివారెడ్డి, నాయుడు, బద్రి, నాగేంద్ర, రంగన్నలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img