Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

సిపిఎస్ ఉద్యోగులకు కేంద్ర చట్టాలు అమలు చేయాలి

విశాలాంధ్ర- ఆస్పరి : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులకు అమలు చేయాలని ఎస్ టి యు జిల్లా కార్యదర్శి పి.నాగేంద్రప్ప డిమాండ్ చేశారు. సోమవారం ఎస్టీయూ మండల శాఖ అత్యవసర సమావేశాన్ని స్థానిక ఎమ్మార్సీ భవనం నందు ఎస్ టి యు మండల నాయకులు కాశీ విశ్వనాథ్ శాస్త్రి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్రప్ప మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2021 లో గెజిట్ నెంబర్ 178 ద్వారా ఎంప్లాయిమెంట్ అకౌంట్ లో ఉద్యోగి వాటా మొత్తం డబ్బులు చెల్లించి, ఆ కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. అయితే రెండు సంవత్సరాలుగా ఏపీ ప్రభుత్వం చనిపోయిన ఉద్యోగికి సంబంధించిన అకౌంట్ లో ఉద్యోగి వాట డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని, దీనివల్ల ఆ కుటుంబానికి ఆర్థిక నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎస్టీ జిల్లా కౌన్సిలర్ శ్రీనివాసులు, జ్యోతి మూర్తి, ఆర్థిక కార్యదర్శి వీరేష్, రామాంజనేయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img