Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

విశాలాంధ్ర` శెట్టూరు : మండల కేంద్రమైన లోని సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో భవిత సెంటర్‌ నందు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెన్నారెడ్డి హాజరై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో రిసోర్స్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి వారంలో ఒకరోజు ఫిజియోథెరపి, స్విచ్‌ థెరపీ , ఇవ్వబడుతున్నాయి. మరియు బుద్ధిమాన్యత కలిగిన పిల్లలకు, పిల్లలకు మాటలు చూపులేని పిల్లలకు మాటలు రాని చెవులు వినిపించిన పిల్లలకు ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా శిక్ష ఇవ్వబడుతుంది వారు తెలియజేశారు ఈ సేవను ప్రతి ఒక్క విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు పిల్లలకు సాధారణ విద్యార్థులకు ఏమాత్రం తీసిపోరని, వారికి సరైన ప్రోత్సాహం ఇచ్చినచో గొప్ప గొప్ప విజయాలను సాధించగలరని అన్నారు. వారికి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉంటాయి కనుక వాటిని సద్వినియోగం చేసుకున్నచో గొప్ప స్థాయిలో ఉండాలని కార్యక్రమంలో రిసర్ష్‌ పర్సన్‌ రాంప్రసాద్‌, ఉపాధ్యాయురాలు సుజాత, మండలంలో ఉన్న ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల వారి తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img