Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అగ్ని ప్రమాదంలో గుడిసె దగ్ధం

విశాలాంధ్ర-పెద్దకడబూరు : మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో కురువ బజారి గుడిసెకు శనివారం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మంటల్లో దగ్ధమయింది. కుటుంబ సభ్యులు గుడిసె తాళాలు వేసి పొలం పనులకు వెళ్లారు. అయితే గుడిసెలో నుండి పొగ మంటలు రావడంతో చుట్టు ప్రక్కల వారు అప్రమత్తమై మంటలు ఆర్పివేశారు. ఇంతలోనే మంటల్లో గుడిసెలో ఉన్న పది క్వింటాళ్ల పత్తి, నాలుగు తులాల బంగారం, 70 తులాల వెండి, 50 వేల నగదు, నాలుగు లక్షల రూపాయల ప్రాంస్పరి నోట్లు, కొత్త ఇంటి ఓపెనింగ్ కోసం తెచ్చుకొన్న రూ. 30 వేలు విలువ చేసే నూతన దుస్తులు మంటల్లో కాలిపోయాయి. సమాచారం తెలుసుకొన్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కురువ బజారి కుటుంబం కట్టు బట్టలతో వీధిన పడింది. గుడిసెకు షాట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చునని భావిస్తున్నారు. రెవిన్యూ అధికారులు అగ్ని ప్రమాదంపై స్పందించి కట్టు బట్టలతో వీధిన పడ్డ కురువ బజారి కుటుంబాన్ని ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img