Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

అవార్డులు బాధ్యతను పెంచుతాయి

జిల్లా కేడీసీసీ డైరెక్టర్ రాఘవేంద్ర

విశాలాంధ్ర- ఆస్పరి : రెవెన్యూ ఉద్యోగులకు లభించే ఉత్తమ అవార్డులు వారిలో మరింత బాధ్యతలను పెంచుతాయని జిల్లా కేడీసీసీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర అన్నారు. ఆస్పరి తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న తాసిల్దార్ కుమారస్వామి, తంగరడోన వీఆర్వో రామాంజినేయులు, శంకరబండ గ్రామ సచివాలయ సర్వేయర్ సురేష్ లకి ఇటీవల జిల్లా ఉత్తమ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కుమారస్వామిని జిల్లా కేడీసీసీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, రెవెన్యూ సిబ్బంది శాలువ పులమాలతో మంగళవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవిన్యూ శాఖలో విధులు నిర్వహించడం అంటే కత్తి మీద సాము లాంటిదని, అంకితభావం, క్రమశిక్షణ, చిత్తశుద్ధి గల వారికి మాత్రమే అవార్డులు వరిస్తాయన్నారు. రెవెన్యూ కార్యాలయంలో మూడు అవార్డులు రావడం సంతోషించదగ్గ విషయమని, జగనన్న శాశ్వత భూహక్కు పథకంలో తాసిల్దార్ చేసిన సేవలు, కృషిని ఆయన అభినందించారు. అనంతరం సన్మాన గ్రహీత తాసిల్దార్ కుమారస్వామి మాట్లాడుతూ అందరి సహకారంతో తాను విధులను నిర్వహిస్తున్నానని, తనకు అవార్డు రావడం సంతోషదాయకమని పేర్కొన్నారు. జగనన్న శాశ్వత భూహక్కు పథకంలో భాగంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించినందుకు అవార్డు రావడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ రమణబాబు, మండల సర్వేయర్ మంజు భార్గవి, ఆర్ఐ భీమేష్, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మన్న, గ్రామ వాలంటరీ రాజు, వివిధ గ్రామాల వీఆర్వోలు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img