Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అవ్వా తాతలకు బాసటగా సీఎం

విశాలాంధ్ర-పెద్దకడబూరు : అవ్వా తాతలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బాసటగా నిలిచారని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ శ్రీవిద్య అధ్యక్షతన, ఎంపీడీఓ వెంకట రమణప్ప ఆధ్వర్యంలో వైఎస్సార్ నూతన పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, వైసీపీ రాష్ట్ర యువనాయకులు ప్రదీప్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా ముస్లింల షాదీఖానాకు భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన భహిరంగ సభలో వారు మాట్లాడుతూ మండలానికి కొత్తగా 205 పింఛన్లు మంజూరు అయినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి నెలా 62 లక్షల మందికి పింఛన్లు కింద వృద్దులు, వికలాంగులు, వితంతువులకు అందజేస్తున్నారని తెలిపారు. వైఎస్ జగన్ కొత్తగా 2 లక్షలు పింఛన్లు మంజూరు చేసి అవ్వా, తాతలకు బాసటగా నిలిచారని గుర్తు చేశారు. అయితే టిడిపి మాత్రం పింఛన్లను జగన్ ప్రభుత్వం తగ్గిస్తుందని దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. పెద్దకడబూరు మండలం గత ఎన్నికల్లో తనకు మంచి మెజారిటీ ఇచ్చిందని, మండలాభివృద్దికి తన వంతు కృషి చేస్తానన్నారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాబార్డు కింద 1.59 కోట్ల రూపాయల తో మంజూరైన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు రాజేశ్వరి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, వైస్ ఎంపీపీ పరమేష్, గ్రామ సర్పంచ్ రామాంజనేయులు, ఉప సర్పంచ్ విజయేంద్ర రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు షేర్ ఖాన్, నాయకులు రవిచంద్రా రెడ్డి, గుడిసె శివన్న, శివరామరెడ్డి, జాము మూకన్న, పూజారి ఈరన్న, రవీంద్ర, తిక్కన్న, ముక్కరన్న, అర్లప్ప, ప్రధానోపాధ్యాయులు రామ్మూర్తి, విద్యాకమిటి చైర్మన్ అనిల్ కుమార్,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img