Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దళితులకే కేటాయించాలి : డిహెచ్‌పీఎస్‌

విశాలాంధ్ర – ఆస్పరి : ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దళిత వర్గాలకే కేటాయించాలని దళిత హక్కుల పోరాట సమితి మండల అధ్యక్ష, కార్యదర్శులు రంగన్న, కృష్ణమూర్తి లు డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిధిలోని కైరిప్పల గ్రామంలో డి హెచ్ పి ఎస్ గ్రామ శాఖ సమితి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా నేటికీ దళితవాడలు, అభివృద్ధికి నోచుకోక వెనుకబడి ఉన్నాయన్నారు. గ్రామాలలో దళిత, గిరిజన కాలనీలకు శ్మశాన స్థలాల సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. గ్రామాల్లో దళితులపై వెట్టి చాకిరి, అంటరానితనాన్ని రూపుమాపేందుకు డిహెచ్‌పీఎస్‌ అండగా ఉండి పని చేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ప్రతి నెలా విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటిని సమావేశ పర్చి దళితుల అభివద్ధి అంశాలను చర్చించాలని కోరారు. అనంతరం గ్రామ శాఖ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా హరికృష్ణ, కార్యదర్శిగా రాజు, సహాయ కార్యదర్శులుగా నాగేష్, బాట కాశన్న, ఉపాధ్యక్షులుగా కుమార్, ఘోర వీరభద్ర, కోశాధికారిగా ముద్ర రంగన్న తో పాటు 20 మందిని కమిటీ సభ్యులుగా ఏకీగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిహెచ్‌పీఎస్‌ మండల నాయకులు రామచంద్ర, వెంకటేశు, శేఖర్, విజయ్, రాజు, పులికొండ, ఏఐటీయూసీ నాయకులు చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img