Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఏప్రిల్ 15న ఏపీఈఏపి సెట్ పరీక్షకు చివరి గడువు..

విశాలాంధ్ర- బుక్కరాయసముద్రం : ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2023 ప్రవేశ పరీక్షను జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సెట్ చైర్మన్, ఉపకులపతి ఆచార్య జింక రంగా జనార్ధన్ పేర్కొన్నారు. మంగళవారం విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో పాత్రికేయల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులకు ఈనెల 15 వరకు చివరి తేదీ అన్నారు. ఈనెల 30 వరకు అపరాధ రుసుము 500, మే 5 వరకు 1000, మే 15 వరకు 5000, చివరి అవకాశం గా మే 14 వరకు 10000 అపరాధ రుసుం చెల్లించి ఆన్లైన్ దరఖాస్తు వెసులుబాటును కల్పించామన్నారు. దరఖాస్తులలో తప్పిదాలను మే 4 నుండి 6 వరకు ఆన్లైన్లో సవరించుకునేందుకు అవకాశం ఉందన్నారు. మే 15 నుండి 18 వరకు ఇంజనీరింగ్, 22 నుండి 23 వరకు అగ్రికల్చరల్, ఫార్మసీ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా పరీక్ష జరుగుతున్నారు. చెట్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య పెరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. మొత్తం 127 కేంద్రాలలో పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో 125,తెలంగాణలో రెండు కేంద్రాలను కేటాయించామన్నారు. కరోనా నియంత్రణ నిబంధనలను అనుసరిస్తూ పరీక్ష నిర్వహణ చేపడుతున్నామన్నారు. ఆన్లైన్ పరీక్ష పై విద్యార్థులకు అవగాహనకు వెబ్సైట్లో అందుబాటులో ఉందన్నారు. ఇప్పటివరకు సెట్ పరీక్షకు మొత్తం 280779 దరఖాస్తులు వచ్చే అన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఆచార్య శోభ బిందు, ఆచార్య భానుమూర్తి, పి ఆర్ ఓ రామశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img