Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కృష్ణమ్మ పరుగుల సోయగం

నిండుకుండలా శ్రీశైలం జలాశయం

శ్రీశైలం ప్రాజెక్టు : పచ్చదనం.. ప్రకృతి సోయగాల నడుమ కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి అత్యధికంగా వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలాశయంలో పదిగేట్లను 20 అడుగుల మేర విడుదల చేయడంతో కృష్ణమ్మ పరుగులు తీస్తున్న దృశ్యాలను చూసి సందర్శకులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో సందర్శకుల తాకిడి మరింత ఎక్కువైంది. దీంతో జలా శయం వద్ద గంటలకొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. సందర్శకులు సెల్ఫీలకు ఫోజులు ఇస్తూ ఫ్యామిలీ ఫొటోలు దిగుతూ ఆనందంలో మునిగితేలుతున్నారు. శ్రీశైలం జలాశయం సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 206.5365 టీఎంసీలుగా నమోదయింది. జలాశయానికి ఎగువ ప్రాంతాలు జూరాల నుంచి 4,58,791 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 71,172 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. కుడి విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పాదన కొనసాగిస్తూ 29,902, ఎడమ విద్యుత్‌ కేంద్రం నుంచి 26,839 క్యూసెక్కుల నీటిని జలాశయం రేడియల్‌ క్రస్ట్‌ గేట్ల ద్వారా కిందికి వదులుతున్నారు. సాగర్‌కు భారీగా వరద నీరు విశాలాంధ్రవిజయపురిసౌత్‌ : ఎగువున గల శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరదనీరు నాగార్జున సాగర్‌ జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు ఆదివారం 14 క్రస్ట్‌ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను ఆదివారం సాయం త్రానికి 585.10 అడుగులకు చేరింది. రిజర్వాయర్‌ కెపాసిటీ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 297. 9235 టీఎంసీల నీరు నిల్వవుంది. నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లోగా 5,18,724 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా 1,05,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతుండటంతో ముంపు గ్రామాల ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. నాగార్జునసాగర్‌ జలాశయం నిండుకుండను తలపిం చటంతో పర్యాటకుల తాకిడి పెరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img