Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కేంద్ర బడ్జెట్ కేటాయింపులో ఏపీకి అన్యాయం

విశాలాంధ్ర- పెద్దకడబూరు : కేంద్ర బడ్జెట్ కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగిందని, గౌతమ్ ఆదాని అక్రమ ఆస్తులు, ఆర్థిక నేరాలపై కేంద్రం ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం పెద్దకడబూరులో సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ పారిశ్రామిక వేత్త ఆదానీ ఆర్థిక నేరాలపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లక్ష కోట్ల రూపాయల అవినీతిలో కూరుకుపోయిన ఆదానీకి రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయిపులు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఆదానీ బోగస్ కంపెనీలు భారీ అవినీతి భాగోతంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీ వేసి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పోస్టు మాస్టర్ లాల్ బాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం తాలూకా కార్యదర్శి ఆంజనేయ, రాజు, ఏఐఎస్ఎఫ్ తాలూకా కార్యదర్శి జాఫర్ పటేల్, నాయకులు ఇర్ఫాన్ పటేల్, డోలు హనుమంతు, గిడ్డయ్య, వీరాంజినేయులు, నర్సింహులు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img