Friday, April 19, 2024
Friday, April 19, 2024

క్షేత్రస్థాయిలో రైతుల అవసరాలు తెలుసుకోవాలి

విశాలాంధ్ర – ఆస్పరి: మండల వ్యవసాయ అధికారులు, సిబ్బంది, సలహా మండలి సభ్యులు క్షేత్రస్థాయిలో రైతుల అవసరాలు తెలుసుకుని ప్రతి నెలా జరిగే సమావేశాల ద్వారా అధికారులకు విషయాన్ని తెలియచేయాలని కర్నూలు జిల్లాలోని అస్పరి మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక రైతు భరోసా కేంద్రంలో అస్పరి మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ రాజగోపాల్‌ రెడ్డి, ఆలూరు ఏడిఏ సునీత, జిల్లా కేడీసీసీ డైరెక్టర్‌ మూలింటి రాఘవేంద్రలు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, రైతు శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగిందన్నారు. మండలంలో 5907 మంది రైతులు పీఎం కిసాన్‌ ఈ కేవైసీని చేయించుకోలేదని, ప్రతి రైతు కూడా ఈ క్రాఫ్‌ బుకింగ్‌, ఈ-కేవైసి చేయించుకోవాలని, రైతులకు రాయితీపై యంత్ర పరికరాలను సరఫరా చేస్తామన్నారు. అనంతరం వైకాపా మండల కన్వీనర్‌ పెద్దయ్య మాట్లాడుతూ మండలంలో ఫర్టిలైజర్స్‌ యజమానులు అధిక ధరలకు ఎరువులు, విత్తనాలను విక్రయిస్తున్నారని ఈ సంవత్సరం నకిలీ పత్తి విత్తనాల వల్ల రైతులు అధిక సంఖ్యలో నష్టపోవడం జరిగిందని, నాణ్యమైన విత్తనాలు, రసాయనాలను విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని, దాడులలో పట్టుపడితే కేసులు నమోదు చేస్తామని వ్యవసాయ అధికారి మునెమ్మ హామీ ఇచ్చారు. ఉద్యన వన అధికారి ఇందిర వివిధ పథకాలు గూర్చి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు, కమిటీ సభ్యులు రాజన్న గౌడ్‌, శివారెడ్డి, నాయుడు, విఏఏ అనిల్‌ కుమార్‌, విహెచ్‌ఎ జ్యోతిర్మాయి ఆర్బికే వాలంటరీలు మంజు, స్రవంతి, మంజునాథ్‌, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img