Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని ఎంపీడీవో, తాహశీల్దార్, సచివాలయం, సిపిఐ కార్యాలయం నందు సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీ విద్య, గ్రామ సర్పంచ్ రామాంజనేయులు, రైతు సంఘం నాయకులు పరమేష్ లు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పురుషోత్తం రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ నాయకులు శాంతి రాజు మాట్లాడుతూ అంబేద్కర్ న్యాయవాది, సామాజిక సంస్కర్త, రాజకీయనేత అని సామాజిక కులవివక్ఱ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారన్నారు. స్వాతంత్య్ర భారతదేశ మొదటి న్యాయ మంత్రిగా పనిచేశారని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తిక్కన్న, వీరేష్, లక్ష్మన్న, హనుమంతు, మాబువలి, రజాక్, అంజనేయ, నర్సింహులు, రంగస్వామి, ఎమ్మార్పీఎస్ నాయకులు యువరాజు, సతీష్, వైసీపీ నేతలు చంద్రశేఖర రెడ్డి, విజయేంద్ర రెడ్డి, శివరామిరెడ్డి, ముక్కరన్న, అర్లప్ప, ఎంపిడిఓ రమణప్ప, పంచాయతీ కార్యదర్శి దస్తగిరి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img