Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

ఘనంగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర -ఆస్పరి : ఆలూరు టిడిపి తాలూకా బాధ్యులు మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ పుట్టినరోజు వేడుకలను టిడిపి నాయకులు ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం స్థానిక గాంధీ పార్కు ఆవరణంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి మండల కన్వీనర్ పరమారెడ్డి, మాజీ ఎంపీపీ రత్నమ్మ భర్త మాజీ డైరెక్టర్ కృష్ణ యాదవ్, మండల కార్యదర్శి శేషాద్రి, మాజీ మండల కన్వీనర్ లు శ్రీనివాసులు గౌడ్, ఎస్ తిమ్మన్న, ఎంపీటీసీ రహంతుల్లా మాట్లాడుతూ నిరంతరం ప్రజా సంక్షేమశీ కోసం పరితపిస్తూ గెలుపైనా ఓటమైన ప్రజలు తోనే నా జీవితం అంటూ నియోజకవర్గ సమస్యలపై గళం ఎత్తి మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులను అలంకరించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నగరూరు గోపాల్, కైరుప్పల, శేశిరెడ్డి, బినిగెరి నారాయణ, నాగన్న, రామక్రిష్ణ , శినప్ప, యుత్ కన్వీనర్ రాఘవేంద్ర, మరేశ్, అట్టేకల్ విజయ్, రాజు, నరేష్, రంగస్వామి లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img