Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఘనంగా సపోస్ క్రిస్మస్ వేడుకలు

విశాలాంధ్ర ^ఆస్పరి : మండల కేంద్రంలోని నారాయణ ప్రైమ్ స్కూల్ లో సపోస్ క్రిస్మస్ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులు క్రీస్తు జన్మదినంపై నృత్య కార్యక్రమాల్లో గొల్లలు, క్రీస్తును పూజించుట, క్రీస్తు కాపరులు సమర్పించుటపై చేసిన నాటికలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ నరేష్ ఆచారి మాట్లాడుతూ ప్రేమ, త్యాగనిరతికి చిహ్నం క్రిస్మస్‌ పండుగ అని.. కుల మత భేదంలేకుండా అందరూ క్రిస్మస్‌ వేడుకలను జరుపుకోవాలని అన్నారు. దేవుడు మానవ రూపంలో మానవ జాతి పాపాలను తొలగించడానికి భూమిపైకి వచ్చాడన్న కారణంగానే క్రిస్మస్ జరుపుకుంటున్నామని, అదే క్రిస్మస్ పండుగకు ప్రధాన ఉద్దేశంగా ఉండాలని సిద్ధాంతగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ దీప్తి, అకడమిక్ డీన్ సతీష్ కుమార్, ఉపాద్యాయులు జ్యోత్స్న, అరుణ, శ్వేతా, రామ, గౌశియ, రేష్మ, నారాయణ, గంగమ్మ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img