Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య

విశాలాంధ్ర -ఆస్పరి : వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు వస్తున్న ప్రజలు, భక్తులు సిపిఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య అన్నారు. బుధవారం మండల పరిధిలోని కైరిప్పల గ్రామంలో శ్రీ కాళికాదేవి, వీరభద్ర స్వామి ఉత్సవాల్లో భాగంగా కామ్రేడ్ పుప్పాల దొడ్డి బండమీద వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం సిపిఐ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అలాగే త్రాగు నీటిని ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కైరిప్పుల గ్రామంలో వారం రోజులు పాటు నిర్వహించే వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా తేరు బజారు, ఎస్సీ కాలనీలో వేరువేరుగా రెండుచోట్ల చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందినీయమని, ఈ ఉత్సవాలకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుండి కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే భక్తులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి, మాజీ సర్పంచ్ శరవన్న, సిపిఐ సీనియర్ నాయకులు తిక్కయ్య, శ్రీనివాసులు, మారెన్న, రంగన్న, పులికొండ, ముద్ద రంగన్న, ఉప సర్పంచ్ వెంకటేష్, సిపిఐ శాఖ కార్యదర్శి వీరేష్, సహాయ కార్యదర్శి వీరేష్, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి రమేష్, గ్రామ నాయకులు శేఖర్, ఉరుకుందు, నవీన్, రెవన్,అనిల్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img