Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

చలి వేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

సర్పంచ్ మూలింటి రాధమ్మ

విశాలాంధ్ర -ఆస్పరి : వేసవిలో మండుతున్న ఎండల వల్ల దాహర్తీని తీర్చుకునేందుకు పాదచారులు, వాహనదారులు రోడ్లపక్కన మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మూలింటి రాధమ్మ అన్నారు. మంగళవారం కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో గాంధీ పార్కు పెద్దబావి దగ్గర, అలాగే చౌరస్తాలోనే అంబేద్కర్ సర్కిల్లోని ప్రధాన కూడలిలో వేరేవేరుగా గ్రామపంచాయతీ వారు రెండు చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మూలింటి రాధమ్మ రిబ్బన్ కట్ చేసి తాగునీరు ప్రజలకు అందించి ప్రారంభించారు. అనంతరం జిల్లా కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, వైకాపా మండల కన్వీనర్ పెద్దయ్యలు మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తీని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడు తాయన్నారు. ఎండల తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రజలు, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు గ్రామ పంచాయతీ వారు ఏర్పాటు చేయడం అభినందనీయమని, పంచాయతీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ ఈవో రామాంజనేయులు, వైకాపా మండల గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, కో కన్వీనర్ పురుషోత్తం రెడ్డి, ఉప సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, రంగన్న, గఫూర్, మల్లేష్ మల్లయ్య, నరసింహారాజు లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img