Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం – ఎర్రకోట జగన్‌ మోహన్‌ రెడ్డి

విశాలాంధ్ర`నందవరం : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ను అందించడమే ముఖ్యమంత్రి వైఎస్‌ . జగన్‌ మోహన్‌ రెడ్డి లక్ష్యమని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సీనియర్‌ నేత ఎర్రకోట జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని మాచపురం గ్రామం లో ఎంపీపీ స్కూల్లో మన బడి నాడు – నేడు పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ. పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో విద్య అందించాలని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఉపాధ్యాయులు తమ వంతు కృషితో విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని పేర్కొన్నారు. మాచాపురం గ్రామం లో నాడు – నేడు ద్వారా పాఠశాల మరమ్మత్తులకు రూ.27 లక్షలు మంజూరు అయ్యాయన్నారు. రూ.25 లక్షలతో గ్రామం లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యత పాటించి , వేగవంతంగా పూర్తి చేయాలని పేరెంట్స్‌ మానిటరింగ్‌ సభ్యులకు సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన బడి నాడు- నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చిందని గ్రామ సర్పంచ్‌ పల్దొడ్డి కిష్టప్ప , ఎంపీటీసీ , నందవరం మండల వైస్‌ ఎంపీపీ అగ్నేశమ్మ , అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి పేట శ్రీనివాసు రెడ్డి , ముగతి గ్రామ సర్పంచ్‌ విరూపాక్షి రెడ్డి , ఈఓపిఆర్డీ. ఈశ్వరయ్య, ఉప సర్పంచ్‌ సప్పోగు కోటప్ప , మచాపుర గ్రామ సచివాలయ సిబ్బంది , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img