Friday, April 26, 2024
Friday, April 26, 2024

పుస్తక పఠనంతో జ్ఞానాన్ని పొందవచ్చు

విశాలాంధ్ర` వెలుగోడు : పుస్తక పఠనం వల్ల విద్యార్థులు జ్ఞానాన్ని పొందుతారని జెడ్పి కో ఆప్షన్‌ మెంబర్‌ సులేమాన్‌ అన్నారు . 55వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా వెలుగోడు గ్రంథాలయ శాఖ నందు మంగళవారం ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. జెడ్పిహోచ్‌ హైస్కూల్‌ విద్యార్థులు ర్యాలీగా గ్రంధాలయాన్ని సందర్శించారు. అయన మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు భక్తి పుస్తకాలు, పురాణాలు సంబంధించిన పుస్తకాలు పుస్తక ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయన్నారు. పుస్తక రూపంలో చదువుకున్నపుడు కలిగే ఆనందం, సంతోషం, ఉల్లాసం చెప్పనలవి కాదన్నారు. ప్రాంతీయ, సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక రంగాలను అవగతం చేసుకునే జ్ఞాన కేంద్రమే పుస్తకమన్నారు. పోటీ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థుల కోసం రీజనింగ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కరెంట్‌ అఫైర్స్‌, స్పోకెన్‌ ఇంగ్లీష్‌, తదితర కాంపిటేటివ్‌ పుస్తకాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థులతో ఏపీ చరిత్ర, జాగ్రఫీ, ఇండియన్‌ ఎకానమీ, రాజకీయ నాయకుల చరిత్రల 
పుస్తకాలు చదివడం వల్ల గతం అవగతం అవుతుందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని సుమలత , ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు , లైబ్రేరియన్‌ బద్దే నాయక్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img