Friday, April 19, 2024
Friday, April 19, 2024

పేద ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే

విశాలాంధ్ర -ఆస్పరి : స్వాతంత్య్రం మా జన్మహక్కు అని గర్జించిన నాటి నుండి నేటి వరకు పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడిన ఘనత సిపిఐకే దక్కుతుందని సిపిఐ జిల్లా సమితి సభ్యులు నాగేంద్రయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ దగ్గర సిపిఐ కార్యాలయం కోసం తీసుకున్న స్థలంలో నూతన పోల్ ను ఏర్పాటు చేసి నాగేంద్రయ్య చేతుల మీదుగా సిపిఐ పతాకాన్ని ఆవిష్కరించారు. పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1925 డిసెంబర్ డిసెంబర్ 26న కాన్పూర్ నగరంలో సిపిఐ ఆవిర్భవించిందని 98 సంవత్సరాలు పూర్తి చేసుకొని బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందన్నారు. పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కమ్యూనిస్టు పార్టీ అండగా నిలబడుతుందన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.,కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సంపదను పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు  అమ్మే యడమే దేశభక్తా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు అంజినయ్య, బ్రహ్మయ్య, ఉరుకుందప్ప, హమాలీ సంఘం అధ్యక్షులు హనుమంతు, రామాంజిని, బన్నీ, చిన్న, పెద్దయ్య, బజారి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img