Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పేద ప్రజల సంక్షేమం కొరకు నిరంతరం పోరాటాలు చేయాలి- సిపిఐ

విశాలాంధ్ర – ఆదోని : భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ 98 వ వార్షికోత్సవం సందర్భంగా పట్టణములో పార్టీ శాఖలలో సిపిఐ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. సోమవారం సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్‌ సుదర్శన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అజయ్‌ బాబు , సిపిఐ జిల్లా సమితి సభ్యులు విరేష్‌, సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్‌ సుదర్శన్‌ మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్‌ 26న సిపిఐ ఆవిర్భవించి నేటికి 98 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ప్రతి వాడలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. భారతదేశ స్వాతంత్ర కోసం పోరాడినటువంటి సిపిఐ నాయకుల ప్రాణ త్యాగాల చేసిన పార్టీ సిపిఐ పార్టీ అని, తెలంగాణ సాయుధ పోరాటంలో సిపిఐ నాయకులు అసువులు బాసి నాలుగువేల మంది కార్యకర్తలు ప్రాణ త్యాగం చేసి, వేల ఎకరాలు భూములు పంచిన చరిత్ర సిపిఐ పార్టీకి దక్కిందని అన్నారు. బ్యాంకుల జాతీకరణకు, రాజముద్రల రద్దుకై విరోచక పోరాటానికి నాంది పలికిన పార్టీ సిపిఐ అని గుర్తు చేశారు. దేశాన్ని పరిపాలిస్తున్న బిజెపి ప్రభుత్వం భారతదేశ లౌకిక వ్యవస్థను నాశనం చేసి, దేశ సంపదను మొత్తం సంపన్న వర్గాలైన కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంపద రక్షించుకోవడానికి ప్రజలు మరో దేశ స్వాతంత్ర పోరాటం కోసం సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి పరిపాలన దోచుకో దాచుకునే పద్ధతిలో ఉందని చెత్త పైన పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారని విమర్శించారు.
ప్రతి పేదవాడికి ఇండ్ల స్థలాలు, ఇండ్లను నిర్మించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కరోనా కష్టకాలంలో ఉన్న పేద ప్రజలపై ప్రభుత్వం అనేక రకాలుగా పన్నులు వేసి పేద ప్రజలను అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులకు గురి చేసిందని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పట్టణంలో కార్మికులు, కర్షకులు భవన్‌ నిర్మాణ కార్మికులు ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్న ప్రభుత్వం ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలం చెందిందని, భవన నిర్మాణ కార్మికులకు ఇసుక సరాపర చేసి ఉపాధి కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు విజయరాజు, సహాయ కార్యదర్శులు. లక్ష్మీనారాయణ, కుమారస్వామి ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు వెంకన్న, ప్రకాష జిల్లా సమితి సభ్యులుకల్లుబావిరాజు, షేక్షావలి, హుసేని, ఒబి నాగరాజు, పార్టీ శాఖ కార్యదర్శి, నాగరాజు గోవిందు, సద్దాం సోమన్న, వైటీ భీమేష్‌ , పాల్‌ నాగరాజు, రమేష్‌, కొత్తూరు ఈరన్న , అంజిత్‌, మాణిక్యమ్మ, కోటమ్మ, గోవిందమ్మ, ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img