Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రజా సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యం


అర్హుల ఇంటికే పథకాలు

మంత్రి గుమ్మనూరు జయరాం

విశాలాంధ్ర -ఆస్పరి : ప్రజా సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి జయరాం అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చిగిళి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సర్పంచ్ జయ్యమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా మంత్రి గుమ్మనూరు జయరాం, ఆయన సోదరులు గుమ్మనూరు నారాయణ స్వామి లకు స్థానిక వైకాపా నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా 18 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను మంత్రి చేతుల మీదగా ప్రారంభించారు. అలాగే గ్రామ సచివాలయం వద్ద సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామంలోనే ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ప్రభుత్వం ఆయా కుటుంబాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.
గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి జయరాం మాట్లాడుతూ చిగళి గ్రామంలో 10 కోట్ల 45 లక్షల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందించడం జరిగిందన్నారు. అర్హత గల ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందించడంతోపాటు, గ్రామాల సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సచివాలయం, వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి పథకం నేరుగా లబ్ధిదారుడి కే అందేలా సీఎం జగన్ ఏర్పాటు చేశారని తెలియజేశారు. గ్రామం నడిబొడ్డున ఉన్న మెయిన్ రోడ్డుకు డ్రైనేజీ వ్యవస్థ లేనందువలన గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఎంపీటీసీ రాధాకృష్ణ మంత్రి దృష్టికి తీసుకురాగా సచివాలయానికి కేటాయిస్తున్న రూ. 20 లక్షలు నిధులతో ప్రజలకు ఉపయోగకరం ఉండే చోట పనులు ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్పరి, ఆలూరు మండలాల కన్వీనర్లు పెద్దయ్య, వీరేష్ మాజీ కన్వీనర్ రామాంజనేయులు, జిల్లా కేడిసిసి డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, కో కన్వీనర్ పురుషోత్తం రెడ్డి, సర్పంచ్ హరికృష్ణ, మాజీ ఎంపీటీసీ మోహన్, బసవరాజు, తిమ్మప్ప ప్రకాష్, అంజినయ్య, మునిస్వామి, లక్ష్మన్న, శివ, పాండు, బిటెక్ బద్రి, నాయుడు, రాజన్న, శివకోటి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img