Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేద్దాం

విశాలాంధ్ర- శెట్టూరు : బాల్య వివాహాల నియంత్రణకు అన్నిశాఖల అధికారుల సమష్టగా కృషి చేయాలని తహసిల్దార్ ఫణికుమార్ సూచించారు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మంగళవారం బాల్య వివాహల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు ఆయన మాట్లాడుతూ విద్య అవశ్యకతను తల్లిదండ్రులకు వివరించి పిల్లలను ఉన్నత చదువు చదివించేలా ప్రోత్సహించాలని అన్నారు బాల్య వివాహాలు చేస్తే రెండేళ్లు జైలు శిక్షతోపాటు లక్ష రూపాయలు జరిమానా విధిస్తామన్నారు ఎక్కడైనా మైనర్ పెళ్లిలు జరిగితే 1098 లేదా 100 కాల్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీమతి లక్ష్మీదేవి , ఇంచార్జ్ ఎంపీడీవో గంగావతి, సీడీపీవో వనజ అక్కమ్మ, వైస్ ఎంపీపీ చెవుల కిష్టప్ప సూపర్వైజర్లు రాధమ్మ, ఎస్సై యువరాజ్ , డాక్టర్ వేణు కార్తికేయ హెల్త్ సూపర్వైజర్లు, సర్పంచులు ఎంపీటీసీలు , పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ కార్యదర్శి గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img