Friday, April 19, 2024
Friday, April 19, 2024

భూసార పరీక్ష మరియు మట్టి నమూనా సేకరణ పై వ్యవసాయ సిబ్బందికిశిక్షణ కార్యక్రమం

విశాలాంధ్ర- బొమ్మనహల్ : బొమ్మనహల్ మండలం , రైతు భరోసా కేంద్రం నందు మండలంలోని 15 రైతు భరోసా కేంద్రాల సిబ్బందికి వ్యవసాయ కమిషనర్ గారి ఆదేశాల మేరకు భూసార పరీక్ష, మట్టి నమూనా సేకరణ పై శిక్షణ కార్యక్రమం శనివారం మండల వ్యవసాయ అధికారి అహమ్మద్ భాష ఆధ్వర్యంలో నిర్వహించడమైనది. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అహ్మద్ భాషా మాట్లాడుతూ రైతులకు భూసార పరీక్షల ఆధారంగా రసాయనిక ఎరువుల వాడకం, నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించడానికి మట్టి నమూనా పరీక్షలు బాగా ఉపయోగపడతాయని, ప్రతి రైతు పొలంలో 500 గ్రాముల,మట్టి నమూనా సేకరించి భూసార పరీక్ష కేంద్రానికి పరీక్ష నిమిత్తం పంపాలని వ్యవసాయ సిబ్బందికి ఆదేశించడం అయినది. రాబోవు ఖరీఫ్ సీజన్లో రైతులు వేసే పంటలకు ఖచ్చితమైన తగిన ఎరువుల మోతాదును సిఫారసు చేసి, నేలను సారవంతం చేస్తూ, తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడులు సాధించాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో రైతు భరోసా కేంద్రం సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img