Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మట్టి నమూనాలు సేకరించాలి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో రైతు భరోసా కేంద్రాల సిబ్బంది మట్టి నమూనాలను సేకరించాలని సహాయ వ్యవసాయ సంచాలకులు అరుణ కుమారి అన్నారు. శనివారం మండల పరిధిలోని హెచ్ మురవణి గ్రామంలో మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ ఆధ్వర్యంలో నేల ఆరోగ్యం మరియు మట్టి పరీక్షలపై రైతు భరోసా సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మట్టి నమూనాల సేకరణ మరియు ఆరోగ్యంపై జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా కేంద్ర సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు . మట్టి నమూనాల సేకరణకు ఏప్రిల్, మే నెలలు అనువైనదని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి 50 మట్టి నమూనాలు సేకరించడం జరుగుతుందని, పంటలు సరిగా పండని సమస్యాత్మక నేలలు గుర్తించి వాటిలో మట్టి నమూనా తీసినట్లైతే పరిష్కారం సులభతరం అవుతుందన్నారు. అలాగే రైతు భరోసా డబ్బులు పడని రైతులను గుర్తించి అర్జీలను మండల వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img