Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మాకు ఎలాంటి నోటీసులు అందలేదు

అసత్య ప్రచారం తగదు
మంత్రి గుమ్మనూరు జయరాం
విశాలాంధ్ర`ఆలూరు :
బినామీ యాక్ట్‌ కింద మంత్రి గుమ్మనూరు జయరాం భార్య రేణుకమ్మకు ఐటీ నోటీసులు ఇచ్చిందన్నట్టుగా వస్తున్న వార్తల పై మంత్రి గుమ్మనూరు జయరాం స్పందించారు. గురువారం మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐటీ శాఖ అధికారులు తన భార్య, మా కుటుంబ సభ్యులకు ఎలాంటి నోటీసులు పంపలేదన్నారు. తన భార్య రేణుకమ్మ మీద వస్తున్న వార్తలను ఆయన ఖండిరచారు. ఏదైనా వార్తను ప్రదర్శించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. కేవలం ఎల్లో మీడియా తమ కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేయడం పనిగా పెట్టుకుందని, త్వరలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తన రాజకీయ, కుటుంబ నేపథ్యం గురించి చెప్పుకొచ్చారు. 1995 సం. లో మా అమ్మ సర్పంచ్‌ గా, 2006లో నేను జడ్పిటిసిగా పనిచేశానని, 2009లో ఎమ్మెల్యేగా ఓడిపోయి, 2014, 2019 సంవత్సరాలలో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జగన్మోహన్‌ రెడ్డి కేబినెట్లో మంత్రిని అయ్యానని వివరించారు. మొదటి నుండి కూడా మాది ఉమ్మడి కుటుంబం అని దాదాపుగా 100 ఎకరాలు భూమి ఉందన్నారు. మాకున్న ఆస్తితో వచ్చిన లాభాల మీద ఆస్పరి మండలంలోఎకరా రూ. 1.5 లక్షలతో 32 ఎకరాల భూమిని రూ. 52 లక్షలతో కొనుగోలు చేశామన్నారు. అన్ని న్యాయబద్ధంగా ఉండడం వలన నా భార్య రేణుకమ్మ, మా కుటుంబ సభ్యులు దాదాపుగా 150 ఎకరాలు కొనుగోలు చేశారన్నారు. నా భార్య భూములను కొనుగోలు చేస్తే ఆమె బినామీ ఎలా అవుతుందని, ఏ చట్టంలో ఉందని ప్రశ్నించారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక ఇలాంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img