Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

యువతకు కొండంత అండగా గ్రంథాలయాలు

విశాలాంధ్ర`ఆస్పరి : విజ్ఞాన నిలయాలుగా ఉన్న గ్రంథాలయాలు నేటి యువతకు, విద్యార్థులకు కొండంత అండగా ఉంటాయని గ్రంథాలయాధికారి విశ్వనాథరెడ్డి అన్నారు. గురువారం స్థానిక గ్రంథాలయంలో వారోత్సవాలలో భాగంగా మూడవరోజు తెలుగు కవులు గుర్రం జాషువా, ధూర్జటి గిడుగురామ్మూర్తి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి, వారి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గ్రంథాలయాలలో న్యూస్‌ పేపర్లు, మ్యాగజైన్స్‌, కథలు, నవలలు, చరిత్ర పుస్తకాలు చదివేందుకు ప్రజలు, యువకులు, వచ్చేవారనీ, ఇప్పుడు ట్రెండ్‌ మారిందన్నారు. ప్రభుత్వం వెల్లడిరచే వివిధ నోటిఫికేషన్స్‌లో విజయం సాధించేలా ఉద్యోగార్థులను సిద్ధం చేసే వేదికలుగా మారుతున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందేనని, ప్రశాంతమైన వాతావరణంలో ఖర్చు లేకుండా పోటీ పరీక్షలతోపాటు ఇతర పుస్తకాలు, మ్యాగజైన్స్‌, దినపత్రికలు ఉచితంగా అందుబాటులో ఉండటంతో గ్రంథాలయానికి క్యూ కడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ పెద్దయ్య, మాజీ కన్వీనర్‌ రామాంజనేయులు, జిల్లా కేడీసీసీ డైరెక్టర్‌ మూలింటి రాఘవేంద్ర, జడ్పిటిసి దొరబాబు, సొసైటీ చైర్మన్‌ గోవర్ధన్‌, మాజీ చైర్మన్‌ కేశవరెడ్డి, వైసిపి నాయకులు తిమ్మప్ప, ప్రకాష్‌, మైనారిటీ నాయకులు గఫూర్‌, ఎంపీపీ స్కూల్‌ హెచ్‌ఎం జ్యోతి మూర్తి, ఉపాధ్యాయులు తిమ్మప్ప, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img