Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రీసర్వే డిప్యూటీ తహసీల్దార్‌గా మహేష్‌

విశాలాంధ్ర` పెద్దకడబూరు : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం నందు సీనియర్‌ అసిస్టెంట్‌ గా పని చేస్తున్న మహేష్‌ గురువారం రీసర్వే డిప్యూటీ తహసీల్దార్‌ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రీసర్వేను ప్రభుత్వం రెండు సంవత్సరాలకు ప్రవేశపెట్టిందన్నారు. దీంతో ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక రీసర్వే డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టును కేటాయించినట్లు తెలిపారు. అందులో భాగంగానే తనకు రీసర్వే డిప్యూటీ తహసీల్దార్‌ గా ప్రమోషన్‌ వచ్చినట్లు వెల్లడిరచారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలలో రీసర్వే లో వచ్చే ఆర్‌ ఓ ఆర్‌ సమస్యలను, పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామకంఠం సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img