Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రైతులు ఈ కేవైసీ చేయించుకోవాలి

విశాలాంధ్ర- పెద్దకడబూరు : రబీలో పంటలు సాగు చేసిన రైతులందరూ ఆర్భీకేలలో ఈకేవైసీ చేయించుకోవాలని ఏఓ వరప్రసాద్ అన్నారు . మంగళవారం పెద్దకడబూరులోని వ్యవసాయ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రబీలో సాగు చేసిన పంటల నమోదుకు ఈ నెల 25లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రబీ సీజన్లో అనగా అక్టోబర్ 2022 తరువాత పంటలు వేసిన రైతులందరూ మండలంలోని తమకు సంబందించిన ఆయా గ్రామాల రైతు భరోసా కేంద్రాల దగ్గరకు వెళ్లినట్లయితే రైతు భరోసా కేంద్ర సిబ్బంది మీ యొక్క పంట నమోదు చేసి ఈకేవైసీ కూడా చేయిస్తారని తెలిపారు. రైతు తాము తీసుకున్న రుణాలకు సున్నా వడ్డీ వర్తించడంతోపాటు రైతు తమ పంటను మద్దతు ధరకు అమ్ముకోవటం, అతివృష్టి అనావృష్టి వల్ల దెబ్బతిన్న పంటలకు భీమా వర్తింపు, పంట నష్టం వర్తించాలంటే ఈ పంట నమోదు తప్పనిసరి అని తెలిపారు. పీఎం కిసాన్ పధకమంలో లబ్ధిదారులందరు ఈకేవైసీ తప్పనిసరి అని, కావున తదుపరి విడతలలో డబ్బులు జమ కావటానికి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img