Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలి

విశాలాంధ్ర- పెద్దకడబూరు : రైతు భరోసా డబ్బులు పడని రైతులు ఎవరికైనా ఉంటే రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి తమ పేర్లను నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ తెలిపారు. గురువారం మండల పరిధిలోని చిన్నతుంబలం గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామ వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రైతు భరోసా డబ్బులు పడని రైతులు ఉన్నట్లయితే వెంటనే కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకుని రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. అలాగే లబ్ధిదారులు ఎవరైనా చనిపోయినట్లైతే వారి పేర్లకు బదులుగా కుటుంబీకుల పేర్లు చేర్చడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందన్నారు. అలాంటి వారు ఉన్నట్లయితే మరణ ధృవీకరణ పత్రం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు తీసుకొని ఆర్బీకే సిబ్బందిని కలిస్తే కుటుంబీకులను లబ్ధిదారుల జాబితాలో చేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ యల్లప్ప, వ్యవసాయ సలహా మండలి సభ్యులు వలి భాషా, వెంకటేశ్, రైతు భరోసా సిబ్బంది రమాదేవి, రవితేజ, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img