విశాలాంధ్ర- పెద్దకడబూరు : మండల కేంద్రమైన పెద్దకడబూరులో మంగళవారం జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ రామాంజనేయులు ఆధ్వర్యంలో గ్రామ శివారులో పెంట దిబ్బలు తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ జగనన్న స్వచ్ఛ సంకల్పం – పరిశుభ్రత లో భాగంగా ఆదోనికి వెళ్లే దారిలో ఇరువైపులా ఉన్న పెంట దిబ్బలను జేసిబితో తొలగించారు. గ్రామంలో ఉన్న మెయిన్ రోడ్లలో దిబ్బలు, చెత్త చెదారం వేయకూడదని ప్రజలను కోరారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లే దిబ్బలను కూడా తొలగించడం జరుగుతుందని సర్పంచ్ తెలిపారు.