Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

లింగ నిర్ధారణ పై అవగాహన సదస్సు

విశాలాంధ్ర -ఆత్మకూరు : ఆత్మకూరు మండల పరిధిలో తలపూరు గ్రామ ఆరోగ్య ఉపకేంద్రం నందు లింగనిర్దారణ చట్టం మరియు గ్రామీణ ఆరోగ్య పారిశుద్ధ్య పౌష్టికాహార కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించడం జరిగింది. లింగనిర్దారణ చట్టం ఆవశ్యకత గురించి ఆ చట్టం ప్రకారం గ్రామాల్లో కమిటీ లు ఏర్పాటు చేసుకుని గర్బిణీ స్త్రీలకు మరియు ఇతరులతో చర్చించి ఎక్కడ కూడా లింగనిర్దారణ పరీక్షలు జరగకుండా చూసేబాధ్యత గ్రామ కమిటీ లు చూడాలని చట్ట పరంగా చర్యలు తీసుకోవాలన్నారు .
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఓబులేసు, ఈఓఆర్డీ సత్యబాబు, ఎంపీహెచ్ ఈ ఓ నాగేశ్వరయ్య, పీహెచ్ ఎన్ తులసమ్మ, పంచాయతీ సెక్రటరీ మహబూబ్ జాన్,వి.ఆర్.ఓ. స్వర్ణలత, మహిళా పోలీస్ వీనిల రేఖ,ఏఎన్ ఎమ్ లక్ష్మీ, అంగన్వాడీ కార్యకర్తలు రమాదేవి,వరలక్ష్మి, సువర్ణ, ఆశా కార్యకర్తలు నాగరత్నమ్మ, శివలింగమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img