Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

లోకేష్ పాదయాత్రకు బ్రహ్మరథం పెట్టిన తెలుగు తమ్మళ్లు

విశాలాంధ్ర, పెద్దకడబూరు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మంగళవారం ఉదయం గవిగట్టు గ్రామ క్రాస్ వద్ద మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం ఇంచార్జీ తిక్కారెడ్డి ఆధ్వర్యంలో మంత్రాలయం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా నారా లోకేష్ కు తెలుగు తమ్మళ్లు ఘన స్వాగతం పలికారు. ముందుగా చిన్నారులు, మహిళలు కలసాలతో స్వాగతం పలికారు. నారా లోకేష్ అందరికీ అభివాదం తెలుపుతూ ముందుకు కదిలారు. మండల పరిధిలోని బాపులదొడ్డి గ్రామ ప్రజలు తమ గ్రామానికి మంచినీటి సౌకర్యం, సీసీ రోడ్లు కావాలని కోరారు. అలాగే పీకలబెట్ట గ్రామస్తులు తమ గ్రామానికి తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, తమ గ్రామానికి దగ్గరలోని కోసిగి మండలం జుమ్మాలదిన్నె చెరువు నుంచి పైపు లైను ద్వారా స్టోరేజ్ ట్యాంకు ఏర్పాటు చేసి తాగునీటిని అందించాలని, అదేవిధంగా తమ పంచాయతీ పరిధిలోని పులికనుమ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, జిల్లా తెలుగు యువత నాయకులు దివాకర్ రెడ్డి, తెలుగు మహిళా అధ్యక్షులు నరవ శశిరేఖ, మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న, నాయకులు మల్లికార్జున, ఆంజనేయ, అంజి, ముక్కన్న, మునిస్వామి, నాగప్ప, సర్దార్ భాష, మల్దకల్,వీరేష్ గౌడ్, శివ, మునెప్ప, సత్యగౌడ్, పెద్దయ్య, వెంకటరామిరెడ్డి, నర్సిరెడ్డి, ఈరన్న అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img